క్రీడలకు పుట్టినిల్లు ఆత్మకూరు : అబ్దుల్లపురం బాషా
ఆత్మకూరు, న్యూస్ వెలుగు; శ్రీశైలం MLA శ్రీ.బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ KVK స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూల్&నంద్యాల జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ముగింపు విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఆత్మకూరు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని చదువుతో పాటు క్రీడలు ప్రతిఒక్కరికి అవసరమని, ఆత్మకూరు పట్టణంలో అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఉందని క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పీల్ మున్నాను అభినందించారు. మొదటి బహుమతి 5000 నందికొట్కూరు, రెండవ బహుమతి ఆత్మకూరు రాము టీం, మూడవబహుమతి నాల్గవ బహుమతి వెలుగోడు మరియు ఆత్మకూరు గెలుపొందడం జరిగింది. మొదటి బహుమతి ముఖ్యఅతిథి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా అందించడం జరిగింది.రెండవ బహుమతి మోమీన్. మునీర్ బాషా మరియు యువణాయకుడు పఠాన్.షాహిద్ ఖాన్ చేతుల మీదుగా అందించడం జరిగింది. మూడవ నాల్గవ బహుమతిని ఆసిఫ్, అసదుల్లా టైగర్ బాబు చేతుల మీదుగా అందించడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ బహుమతి మోటార్ షఫీవుల్లా చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ నాయకులు ఆసిఫ్ బేగ్,బుడ్డా రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని మోటార్ షఫీవుల్లా , నాయబ్ సయ్యద్ అసదుల్లా , ఆత్మకూరు మాజీ సర్పంచ్ జిలానీ తనయుడు మోమిన్.మునీర్ బాషా ,యువనాయకుడు పఠాన్.షాహిద్ ఖాన్ తైక్వాండో శిక్షకులు ఖాజా హుస్సేన్,స్వామన్న,ఆత్మకూరు స్పోర్ట్స్ చైర్మన్ పస్పీల్ మున్నా,టీచర్ జగదీష్,టీచర్ శ్రీధర్, జావేద్,కరీం పాల్గొన్నారు.