
మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మండల వైసీపీ నాయకులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి కు తుగ్గలి మండల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.గురువారం రోజున కర్నూల్ లోని ఆమె స్వగృహం నందు జన్మదిన సందర్భంగా పుష్ప గుచ్చాలను అందజేసి,కేకు కత్తిరించి జన్మదిన శుభాకాంక్షలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జిట్టా నాగేష్,మాజీ జెడ్పిటిసి పగిడిరాయి జగన్నాథరెడ్డి, తుగ్గలి మోహన్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, రాతన మోహన్ రెడ్డి,బసిరెడ్డి,కారం భాస్కర్ రెడ్డి,రాతన ఉమన్న, కడమకుంట్ల అమర్నాథ్ రెడ్డి,గిరిగెట్ల విష్ణువర్ధన్ రెడ్డి తదితర మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu