భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
హొళగుంద మండల మాదాసి మాదారి కురువ కమిటీ సభ్యులు డిమాండ్
హొళగుంద, న్యూస్ వెలుగు; గురువారం హొళగుందలో మదాసి మదారి కురువ సంఘం కమిటీ సభ్యులు సమావేశం ఆవ్వడం జరిగింది మాదాసి కురువ సంఘం ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యట మల్లయ్య,కనక శ్రీ యూత్ నాయకుడు,SKగిరి,హొళగుందా మండల మాదాసి కురువ సంఘం అధ్యక్షులు పంపాపతి,మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కురువల ఆరాధ దైవమైన శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతి మహోత్సవాన్ని ఈ నెల 18-11-2024 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా నిర్వహించి భక్త కనకదాసు కార్యక్రమాన్ని స్టేట్ ప్రోగ్రాంగా కర్నూల్ జిల్లా లోనే నిర్వహించాలని,అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలలో కనకదాసు జయంతిని ఒక పండుగలా జరపాలని భక్త కనకదాసు జయంతి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని అలాగే శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు భవనము,మ్యూజియం, విద్యాసంస్థలను,కర్నూలు జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొగిలాతోట శేషప్ప,బసవ,చిన్నహ్యట మాజీ సర్పంచ్ kb విరబద్రప్ప, హొళగుందా మండలం మాదాసి కురువ సంగం సహాయ కార్యదర్శి గాది,సంఘం నాయకుడు గాదిలింగప్ప,మండలం ఉప అధ్యక్షలు రవి,సంఘం సలహాదారుడు రామాంజనేయులు,డాక్టర్ చంద్రశేఖర్,మండల కార్యదర్శి మైలారి,జాతీయ సంగోల్లి రాయన్న సంగం ఆలురు తాలూక ప్రధాన కార్యదర్శి మంజునాథ్,మాదాసి కురువ కమిటీ మెంబర్ గోపాల్,సిదప్ప,నరేగల్ల,ఆలూరు తాలూకా,మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..