సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందజేయాలి

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందజేయాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు: సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక సి.క్యాంప్ లోని సచివాలయం 61, 62 లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా సచివాలయంలోని సిబ్బంది హాజరు పట్టిక, ఇతర రికార్డులను పరిశీలించారు.. సచివాలయ సిబ్బంది కొంతమంది మాత్రమే ఉండడంతో ఎక్కడికి వెళ్లారని కలెక్టర్ ఆరా తీశారు.. వీఆర్వో బదిలీపై వెళ్ళారని,శానిటేషన్ సెక్రటరీ సెలవు పై వెళ్లారని62వ సచివాలయ సిబ్బంది బి ఎల్ ఓ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు.. ఈ అంశంపై కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ తో మాట్లాడి ధ్రువీకరించుకున్నారు..రోజుకు ఎంత మంది వస్తున్నారు,ఏ విధమైన సర్వీసులు ఇస్తున్నారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు గడువు లోపు సేవలను అందించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మెప్మా పిడి నాగ శివ లీల తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!