ఊహా చిత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం
జమ్మూకశ్మీర్ (Jammu&Kasmir): దోడాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్లను పోలీసులు అధికారులు విడుదల చేశారు. సమాచారం ఇచ్చినవారికీ రూ.5 లక్షల రివార్డును ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి సమాచారాన్నైనా జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అందినలను మీడియా ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేసాలోని ఉరార్ బాఘీ ప్రాంతంలో ఇటీవల జరిగిన దాడుల్లో వీరి ప్రమేయం ఉందని వెల్లడించారు. వారి ఆచూకీ లేదా కదలికలకు సంబంధించిన ఏదైనా సమాచారంతో ప్రజలు ముందుకు రావాలని కోరారు. సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. SSP దోడా 9541904201, SP HQ దోడా 9797649362, 9541904202, SP OPS దోడా 9541904203, DYSP HQ దోడా 9541904207, SHO 4207 4211 మొదలైన సాధారణ ప్రజలు సమాచారం అందించాలన్నారు.