
జమ్మలమడుగు అభివృద్ధికి షురూ… వేగంగా కొనసాగుతున్న పనులు
జమ్మలమడుగు టౌన్ ( న్యూస్ వెలుగు ): జమ్మలమడుగు మున్సిపాలిటీలోని మురికి కాలువల అభివృద్ధికి వేగంగా పనులు సాగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది. జమ్మలమడుగు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డిలు కంకణం కట్టారు. ఎప్పటిలాగే ఎమ్మెల్యే ఆది అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ఆది అనే వినాదంతో ఆయన ముందుకెళ్లారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో వైసిపి ఏ ఒక్క అభివృద్ధి గాని చేయలేదు. మున్సిపాలిటీని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పలుమార్లు విమర్శిస్తూ వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మురికి కాలువల అభివృద్ధికి వేగంగా పనులు కొనసాగించడం ఇంకా మున్ముందు జమ్మలమడుగు అభివృద్ధి పథంలో ఉంటుందని, ఇంతకన్నా ఇంకేం కావాలి మన జమ్మలమడుగు కి అని మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.