
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాఠశాలకు ప్రింటింగ్ జిరాక్స్ ను బహుకరించిన పూర్వ విద్యార్థులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని ఆర్ ఎస్ పెండేకల్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 సంవత్సరం నుంచి 1993 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థిని విద్యార్థులు దాదాపు 32 ఏళ్ల తర్వాత అలనాడు వారు చదివిన పాఠశాలలో వారికి విద్య నేర్పిన గురువుల సమక్షంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ కె. నరేంద్ర ప్రసాద్ సమక్షంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సరస్వతి దేవి చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలతో జ్యోతి ప్రజ్వల వెలిగించి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కలయికను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనంతరం ఆనాటి గురువులైన తెలుగు బోధకులు షేక్. హుసేన్ సాహెబ్.డ్రాయింగ్ మాస్టార్ గోపాల్ శర్మ.పాఠశాల లైబ్రేరియన్ బోధకులు రాముడు.గణిత బోదకులు గంగన్న తదితర గురువులకు పూల మాలలు వేసి శాలవాలతో సత్కరించి పాఠశాల మేమేంటోలను అందజేసి వారి గురువులను ఘనంగా సన్మానించారు.పూజా కార్యక్రమాల తర్వాత వారితో పాటు పదో తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు తొమ్మిది మంది మరణించిన వారిని గుర్తు చేసుకుని మరణించిన తొమ్మిది మంది పూర్వ విద్యార్థులకు అశృనివాళులర్పించారు.
పూర్వ విద్యార్థుల కలయిక సందర్బంగా పాఠశాలలో నిరంతర సేవలకు బహుమానంగా పూర్వ విద్యార్థులు ప్రింటింగ్ ప్రెస్, జిరాక్స్ ప్రింటర్ ను బహుకరించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 1980 లో మాకు చదువుతో పాటు సమసమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలను క్షుణ్ణంగా వివరించిన వైనం మాకిప్పటికి గుర్తుండి పోయాయాయని మేము మా జీవితంలో ఏస్థాయిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎంతటి ఉద్యోగంలో ఉన్నా, మేమెంత పొజిషన్ లో ఉన్నామంటే కారణం,మాకు చదువు నేర్పిన గురువుల వలనే అని ఆ గురువులు నేర్పిన క్రమశిక్షణ గుణ పాఠాలే మాకు మా జీవితంలో నేర్పిన గొప్ప పాఠాలు అని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో అలనాటి పూర్వ విద్యార్థిని విద్యార్థులు,రాంపల్లి,రాంకొండ, ఆర్ ఎస్ పెండేకల్, పెండేకల్ ఆర్ ఎస్. ఇందిరాంపల్లి,చనుగొండ్ల, మారెళ్ల, బొంది మడుగుల, నల్లగుండ్ల, ముక్కెళ్ళ,తుగ్గలి పలు గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చి చదువుకున్న పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు సతి సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.