అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్  మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల జారీ

అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్  మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల జారీ

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ (పథకం- ఆరోగ్య పింఛన్లు) మెడికల్ బోర్డు గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొందరి పేషెంట్లకు పెన్షన్ పెంచడానికి అనుమతులు జారీ చేసింది.. వీల్ చైరు బెడ్ కు మాత్రమే పరిమితమైన పేషంట్లకు, ప్రమాదాలు జరిగిన పేషెంట్ లు  మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న పేషంట్లకు పెన్షన్ 5000 నుంచి 15000 కు పెంచడానికి నిర్ణయించింది. రెండు కాళ్లకు బోదకాలు వ్యాపించిన వారికి, ప్రత్యేక పరిస్థితిలో కిడ్నీ డయాలసిస్ చేసుకునే రోగులకు నిబంధనలు అనుసరించి, మరియు కిడ్నీ, కాలేయము, హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న పేషంట్లకు 5 వేల నుంచి 10 వేల వరకు పెన్షన్ పెంచడం జరిగింది అని అన్నారు. అందుకోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ (పథకం- ఆరోగ్య పింఛన్లు) మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల జారీ కొరకు మెడికల్ టీం ప్రతి బుధవారము ధన్వంతరి హాల్లో నిర్వహించే బోర్డును సదరం 41 లో నిర్వహించనున్నట్లు తెలిపారు 11 గంటల నుంచి 1:00 వరకు, ఈ సర్టిఫికెట్లు అర్హులైన వారికి ఇస్తారు.

Author

Was this helpful?

Thanks for your feedback!