ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈనెల 15న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!