గ్రామీణ సమస్యలను పరిష్కరించండి : సిపిఐ
కర్నూలు, న్యూస్ వెలుగు; మండలంలోని తాడూరు గ్రామంలో సిపిఐ శాఖ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ శాఖ కార్యదర్శి మాధవయ్య అధ్యక్షత నిర్వహించారుఈ సమావేశానికి ముఖ్య అతిధులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు జిల్లా కార్యదర్శి కామ్రేడ్N రంగ నాయుడు పాల్గొన్నారుఈ సమావేశాన్ని ఉద్దేశించి కే రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను మౌలిక వసతి సదుపాయాలు లేక గ్రామీణ ప్రాంతాల్లోనే సిసి రోడ్లు డ్రైనేజీ కాలంలో వీధి దీపాలు లేక గాఢాంధకారంగా గ్రామాలు ఉన్నాయన్నారు గ్రామానికి స్మశానం వాటిక దారి తక్షణమే వేయాలని వారన్నారు..సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని రైతు కూలీలు ఇప్పటికే పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు గుంటూరు హైదరాబాదు బొంబాయి బెంగళూరు మహా నగరాలకు వలస వెళుతున్నారు ఇంటిదగ్గర పిల్లల చదువు వదులుకొని ముసలి వాళ్ళను ఇంటి దగ్గర వదిలేసి వారికి సరైన టయానికి అన్నము లేక ఆకలితో అలమటిస్తున్నారు వయసు మీద పడి అఘోరంగా నివసిస్తున్నారు అందుకోసమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికారులు ప్రభుత్వ ఆఫీసులకే పరిమితమయ్యారని వారు ఆవేద వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల కార్యదర్శి నారాయణ రైతు సంఘం మండల కార్యదర్శి సుధాకర్ లింగమయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.