
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
చాచా నెహ్రూ కి ఘన నివాళి
నెహ్రూ సేవలు మరువలేనివి
2023 -24 సంవత్సర పదో తరగతి టాపర్స్ కి ల్యాబ్ టాప్, టాప్స్ పంపిణీ
చీప్ గెస్ట్ గా అశోక్ ఆనంద్ కుమార్
ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని కరివేన గ్రామంలో ఉన్న డిపౌల్ స్కూల్లో
గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఫాదర్ షిన్స్ జాకబ్, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ వినీత్, ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫాదర్ అశోక్ ఆనంద్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉంచుకోవాలని, తల్లిదండ్రుల భావాలను పిల్లలు అర్థం చేసుకొని చదవాలన్నారు. విద్యార్థులు చెడుకు దూరంగా ఉండి ఆదర్శభావాలను అలవర్చుకోవాలని, ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలపాలన్నారు. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవం గా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు .నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరువలేని అన్నారు. విద్యార్థులు సాంస్కృత కార్యక్రమాలు, నాటికలు, వేషధారణలు, నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కేకులు కట్ చేసి బాలల దినోత్సవం జరుపుకున్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థినీ , విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమొంటో బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.