శనగ ,కంది పంటలకు ప్రయోజనకరమైన వర్షం
మండల వ్యవసాయ అధికారి.మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ఖరీప్ లో సాగు చేసిన కంది,ప్రత్తి, రబీలో సాగు చేసిన శనగ,జొన్న, మినుము,పంటలు సాగు చేసిన రైతులకు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులకు ఊరట నిచ్చింది అని,పంట కు ఎంతో మేలు,ఉపయోగకరమైన వర్షం కురిసినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఆయా గ్రామాల్లో సాగు చేసిన శనగ పంటకు కంది పంటకు,జొన్న పంటకు ప్రత్తి పంటకు ఎంతో ఉపశమనం కలిగింది అని ఈ రోజు కురిసిన వర్షం వల్ల బెట్టకు రాకుండా పలు పంటలకు ఉపయోగం అని తెలిపారు.ఈ రోజు వర్షం రావడం వల్ల రైతులు సాగు చేసిన పంటలకు నీటి తడులు కొరకు వేల రూపాయలు ఖర్చు అయ్యేది అని ఈ వర్షం వల్ల రైతులకు ఆ ఖర్చు లేకుండా మిగిలింది అని రైతులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు.ఈ వర్షం వల్ల ఆయా పంటల్లో మంచి దిగుబడులు వస్తాయని రైతుల్లో ఆశాజనకం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.