
పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యం పదిలం; డాక్టర్ శ్రీలక్ష్మి
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణిలు తెలిపారు.శుక్రవారం మద్దికేర బోగప్ప బావి పరిసరాల్లోని ఇళ్లలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు.ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా సీజనల్ వ్యాధులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే డెంగీ,చికెన్ గునియా,కలరా,టైఫాయిడ్ వంటి వ్యాధులు దరిచేరవన్నారు.ప్రతి ఒక్కరు ఫ్రైడే డ్రైడే పాటించాలని వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆరోగ్య విద్య అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కృష్ణమ్మ,సూర్య నారాయణ,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ ప్రొవైడర్ అంజలి,ఆరోగ్య కార్యకర్త సువర్ణ,ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu