ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి; సిపిఎం

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి; సిపిఎం

 తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహణ

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రజా సమస్యలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ అధిక ధరలు,నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు,వలస నివారణ,రైతుకు గిట్టుబాటు ధర తదితర ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని వారు తెలియజేశారు.తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వం వాటి గురించి మాట్లాడకపోవడం దారుణమని,అన్నిటికంటే ముఖ్యమైన పిల్లల చదువులకు సంబంధించి తల్లికి వందనం,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 రూపాయలు,రైతు భరోసా కింద 20,000 వంటి తదితర పథకాలు నేటికీ అమలు నోచుకోలేదని,మెగా డీఎస్సీ అందని ద్రాక్ష పండులా మారిందని,ఇలా ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో టిడిపి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని వారు తుగ్గలి తహసిల్దార్ రమాదేవి కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో రంగస్వామి,రంగరాజు,ముక్కెళ్ల పక్కిరి, చెన్నయ్య,రవి,రాజు,శేఖర్ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!