
ఓంకారం లో కనులపండుగగా కార్తీక పౌర్ణమి
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ ఉమా సమేత సిద్దేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.వేకున జాము నుంచి భక్తులు కోనేట్లు స్థానాలు ఆచరించి శ్రీ గంగా ఉమా సమేత సిద్దేశ్వర స్వామి వార్లను దర్శించుకుని కాయ కర్పూరంతో తమ ముక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈవో నాగప్రసాద్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణ నంది శివ నంది మండలంలోని శివాలయలు భక్తులతో కిటికీటలాడాయి.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU