
వార్డెన్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి
నంద్యాల, న్యూస్ వెలుగు; ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డిఆర్ఓ  డిఇఓ 
ముందుగా నందికొట్కూరు బీసీ బాలికల వసతి గృహాన్ని అభివృద్ధి చేయకుండా మూసి వేయడంపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం నంద్యాల జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి ని కలిసి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, విద్యార్థుల హక్కులను కాలరాస్తూ సెలవుల దినాలలో కూడా పాఠశాలల్లో తరగతు నిర్వహిస్తున్నారని నంద్యాల జిల్లా విద్య అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విద్యార్థులకు ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా వారిని శారీరకంగా , మానసికంగా హింసిస్తున్నారని అయితే ఒత్తిడికి లోనైనటువంటి విద్యార్థులు చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు లోనై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఇప్పటికైనా విద్యార్థుల పట్ల వారి జీవితాల పట్ల ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఆలోచించాలని లేనిపక్షంలో అట్టి విద్యాసంస్థలపై ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు..


 DESK TEAM
 DESK TEAM