
రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి; బాస్కరయ్య
కర్నూలు, న్యూస్ వెలుగు; రజకుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాస్కరయ్య కర్నూలు లో కోరారు. కర్నూలు లోని రజకవృత్తిదారుల సంఘం కార్యాలయంలో రజక సంఘల నాయకుల లతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం లో 38వేల కోట్ల రూపాయలతో బీసీల అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పి నెరవేర్చనందున బీసీ లు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధి కి 39వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని 39 వేల కోట్ల రూపాయలు ఏవిధంగా ఖర్చు చేస్తారో చెప్పాలని ఆయన కోరారు. నూతనంగా నియమించిన కార్పోరేషన్ ల ద్వారా బీసీ కులాలకు ఏంచేయాలనుకున్నారో విధివిధానాలను తెలపాలన్నారు. ఎన్నికల హామీ మేరకు రజకవృత్తిదారులకు 50 సంవత్సరాలు దాటిన వారికి ఫింక్షన్ ఇవ్వాలని బాస్కరయ్య కోరారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా రజకులకు ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టం తీసుకుని రావాలని కోరారు. రజకవృత్తిదారుల సంఘం రాష్ట్రకార్యదర్శి. బాస్కరయ్య, గురుళశేఖర్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar