టిడిపి కార్యకర్త రాముల సుంకన్న అనారోగ్యంతో మృతి
నివాళులర్పించిన ఉప్పర్లపల్లె గ్రామ టిడిపి నాయకులు.
అంత్యక్రియల కొరకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన టిడిపి నాయకులు.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల ఉప్పర్లపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాముల సుంకన్న అనారోగ్యంతో గురువారం రోజున మృతి చెందాడు.ఈ సందర్భంగా ఉప్పర్లపల్లి గ్రామ టిడిపి నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టిడిపి కార్యకర్త రాముల సుంకన్న కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల ఖర్చులకు గాను 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాముల సుంకన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ టిడిపి నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకు రాముల సుంకన్న ఎంతో కృషి చేశారని వారు తెలియజేశారు.ప్రతి టిడిపి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పా వేణు,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,నీలా ప్రసాద్,నీలా మనోహర్,బోడబండ తాండ రాము నాయక్,ఈశ్వరయ్య, విద్యా కమిటీ చైర్మన్ టైలర్ కంబగిరి, స్వామి నాయక్,లక్ష్మీ నాయక్,నాగేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వనాథ్ తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.