కర్నూలు లో హైకోర్టు బెంచ్, లోకాయుక్త కోర్టు ఏర్పాటు చేయడం సంతోషకరం

కర్నూలు లో హైకోర్టు బెంచ్, లోకాయుక్త కోర్టు ఏర్పాటు చేయడం సంతోషకరం

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసిన టిడిపి నాయకులు.

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాయలసీమ నందు అత్యంత వెనుకబడిన జిల్లా అయినా కర్నూలు జిల్లా నందు హైకోర్టు బెంచ్ మరియు లోకాయుక్త కోర్టు ఏర్పాటు చేయడంపై మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, మాజీ ఎంపీటీసీ వల్లె వెంకటేష్,కిష్టయ్య లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా గురువారం రోజున వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వీటిని ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేసిన ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు.హైకోర్టు బెంచ్ మరియు లోకాయుక్త కోర్టు ఏర్పాటు చేయడం వలన వెనుకబడిన కర్నూలు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కర్నూలు జిల్లా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మామిళ్ళకుంట తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!