కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నాం
అమరావతి; కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసే అంశంపై శాసనసభ గురువారం ప్రభుత్వం పెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు
Was this helpful?
Thanks for your feedback!