
రాజా రెడ్డి నగర్ బాధితులకు న్యాయం చేయండి
పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు బోయ
పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో ఈ జిల్లా ఎన్నడూ చూడని అంత స్కాం జరిగితే ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఆనాడు ఇక్కడ జరిగిన స్కాం మీద స్థానిక ఆర్డీఓ ని సంప్రదించగా మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు అంటే లోకాయుక్త కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. లోకాయుక్త కు మేము ఇచ్చిన సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ కలెక్టర్ గారికి ఆర్డర్ చేయగా వారు స్థానిక ఆర్డీఓ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ స్థానిక ఎమ్మార్వో, హౌసింగ్ డిఈ, ఈఈ తో ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ ఇళ్ళు మంజూరు అయిన విషయం వాస్తవమే, లబ్దిదారులకు పట్టాలు ఇచ్చారు, కేంద్రం నుండి స్టేట్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి డబ్బులు కూడా ఖాతా ధారుల అకౌంట్స్ లో జమ చేయబడ్డాయి అని కొన్ని ఇళ్ళు నిర్మాణం కూడా చేయబడ్డాయి, కానీ లాండ్ కన్వర్షన్, రోడ్డు, వాటర్ సప్లై, కరెంట్ వంటి వసతులు వంటివి మంజూరు కాలేదు అని ఇపుడు ఆ భూమి ప్రైవేటు వ్యక్తుల మీద రిజిస్టర్ అయింది అని ఎలా అయిందో సమాచారం లేదు అని వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ బేస్ చేసుకొని ప్రజలకు న్యాయం చేయమని పోయిన ప్రభుత్వం లో ఎమ్మెల్యే గారిని కోరినా ఇంత పెద్ద స్కాం చేసిన వారు వారి పార్టీలో ఉండటం వలన పట్టించుకోని దుస్థితి, కనీసం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అయినా స్థానిక ఎమ్మెల్యే గారు బాధితుల కష్టాలను అర్థం చేసుకొని వారికి న్యాయం చేయాలని, ఇళ్ళు లేని వారికి తిరిగి ఇప్పించి ఆదుకోవాలి అని, వారి పారదర్శకత, జవాబుదారీతనం నిబద్ధత నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ఇళ్ళు మాకే అనే కార్యక్రమం చేపట్టి బాధితులకు అండగా ఉంటాం అని సేకరించిన ఆధారాలతో వారికి భరోసా కల్పిస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు తెలిపారు, కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రంగన్న తదితరులు పాల్గొన్నారు.