ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన

ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు యాంటీ బయాటిక్స్ వాడకం మానుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజి యందలి మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో “యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారం” నవంబర్ 18 – 24 సందర్భంగా రెండవ సంవత్సరం ఎం. బి.బి.ఎస్ విద్యార్థులు పోస్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విపరీతంగా అంటీ మైక్రోబియల్ మందుల వాడకం పెరగడం రెసిస్టెన్స్ ఏర్పడి అవి పనిచేయకుండ పొతు న్నాయని అని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్లును తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమము లో ఆసుపత్రి సూపరిండెంట్ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విపరీతంగా యాంటీ మైక్రోబియల్ వాడకం నేడు మానకుంటే రాబోయే కాలంలో రోగాలను తగ్గించేందుకు మందులు పనిచేయక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డి ప్రొఫెసర్ డాక్టర్ రేణుకాదేవి, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్. ఓ.డి ప్రొఫెసర్ డా.సుధా కుమారి, ప్రొఫెసర్ నాగ జ్యోతి అసోసియేట్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!