మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు
న్యూస్ వెలుగు, కర్నూలు. నగరపాలక సంస్థ; నగరంలో వివిధ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలను తయారుచేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపడఖాన, డబరా, వడ్డేగిరి, బి.క్యాంపు ప్రాంతాల్లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా కాలనీల ప్రజలు చేసిన ఫిర్యాదు ప్రదేశాలను కమిషనర్ పరిశీలించి, సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్థానికుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని, తక్షణమే సంబంధింత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, డిఈఈ క్రిష్ణలత, మనోహర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు అంజద్ బాషా, దామోదర్, శానిటేషన్ ఇంస్పెక్టర్లు అనిల్, వలి, జిలాన్ తదితరులు పాల్గొన్నారు.