
అధ్వాన స్థితిలో……హొళగుంద-ధణాపురం రోడ్డు..!
రోడ్డు పనులు ప్రారంభించాలని ఎన్ని వినంతు చేసిన ఫలితం శూన్యం.
రోడ్డు వైపు కన్నెత్తి చూడని అధికారులు
హొళగుంద, న్యూస్ వెలుగు: ప్రభుత్వాలు మారినా ధణాపురం – హోళగుంద రహదారి రూపురేఖలు మాత్రం మారడం లేదు.ముఖ్యంగా అధికారులు రహదారి సమస్య పై పట్టించుకోకపోవడంతో రోడ్డు దుస్థితి అధ్వానంగా మారింది. నిత్యం రద్దీగా ఆటోలు,ద్విచక్ర వాహనాలు తిరిగే రహదారి గుంతలమాయమై నరకాన్ని తలపిస్తుంది.వివరాలోకెళ్తే హొళగుంద నుంచి హెబ్బటం,నాగనాథన హళ్ళి,ధణాపురం వెళ్లే రహదారి తీవ్ర అధ్వాన్నంగా తయారైంది.ఈ రోడ్డు నిర్మాణం పనులు చాలా కాలం నుంచి ప్రారంభించకపోవడంతో రహదారి గుంతలమాయంగా మారి ప్రయాణం నరకయాతనగా మారిందని ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా రోడ్డు సమస్య పై పలుమార్లు అధికారులకు విన్నవించినా…మరియు పలుమార్లు గ్రామ స్థాయి సమావేశాలు బైకాట్ చేసిన  ఫలితం లేకపోయింది. దింతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.అలాగే ఈ రహదారిలో ప్రయాణికులు ప్రమాదాలకు గురైన సందర్భలతో పాటు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం ఎన్నో ఉన్నాయని ప్రయాణికులు,వాహన దారులు తెలిపారు.సుమారు 25 కి.మీ పైగానే అద్వాన్నంగా ఉన్న రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar