రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
బండి ఆత్మకూరు, న్యూస్ న్యూస్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తోళ్ల మంజునాథ్ ను కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం శ్రీశైలం నియోజకవర్గం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శ్రీరాములు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయ నిర్వహణ కార్యదర్శి రౌతు అశోక్ కుమార్ జనసేన మహానంది మండల నాయకుడు రామయ్య మల్లికార్జున బండి ఆత్మకూరు మండల నాయకుడు సురేష్ వెలుగోడు భాష తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!