జస్టిస్ పున్నయ్య సిఫారసులను అమలు చేయండి : టిఎం రమేష్
kurnool (కర్నూలు ): ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ ర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో దళితులే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు, హత్యాచారాలు భూకబ్జాలు, కుల వివక్షత అంటరానితనంతో జరుగుతున్న దాడులపై జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు పరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. గ్రామాల్లో దళితులే లక్ష్యంగా ఉన్నత వర్గాల వారు దాడులు చేస్తున్నారని , దాడులకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని , దళితుల ఫిర్యాదులను పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తక్షణమే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి సత్వరం బాధితులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉండాలని కలెక్టర్ కు కోరినట్లు ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ పేర్కొన్నారు. దళితులకు ప్రభుత్వాలు కేటాయించిన అసైన్మెంట్ భూములకు రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులను మోసం చేస్తున్నారన్నారు . దళితుల భూములకు రక్షణ కల్పించి దళితుల భూములను ఆక్రమించుకున్న వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. దీనికి స్పందించ కలెక్టర్ దళితులపై దాడులు దౌర్జన్యాలు హత్యాచారాలు భూకబ్జాలు జరగకుండా నిరంతరం రెవెన్యూ , పోలీస్ వారితో దళిత కాలనీలో పర్యవేక్షణ జరిపించి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ కర్నూల్ సిటీ ప్రెసిడెంట్ గోవిందు మాదిగ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిడ్డయ్య నంద్యాల జిల్లా అధ్యక్షుడు రాసి పోగుల శ్రీనివాసులు , ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ పెద్దరాజు దేవనకొండ మండలం ఇంచార్జ్ చెన్నకేశవులు , పత్తికొండ నియోజకవర్గం అధికార ప్రతినిధి రాజశేఖర్ , దేవనకొండ మండలం ప్రధాన కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.