
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాణించాలి
జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు
కర్నూలు, న్యూస్ వెలుగు; నేటి నుంచి 25వ తేదీ వరకు అనంతపూర్ జిల్లా నార్పల లో జరగబోయే 43వ సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లాకి క్రీడాకారులు పాల్గొని పథకాలే లక్ష్యంగా దూసుకుపోవాలని జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. శనివారం కర్నూలు రైల్వే స్టేషన్ నందు ఏర్పాటు చేసిన క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు అందజేశారు.
సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు క్రమశిక్షణతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని స్నేహభావాన్ని పెంపొందించుకొని విజేతలగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి ఎం.అవినాష్ శెట్టి,కర్నూలు జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి బి ఈశ్వర్ నాయుడు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు