న్యాయ సహాయ సేవలందించడమే జాతీయ,రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; మహిళకు న్యాయ సహాయ సేవలందించడమే న్యాయ సేవధికర సంస్థ ఊద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఓర్వకల్ మండలం స్థానిక పొదుపు భవన్ కార్యలయంలో శనివారము జాతీయ మహిళల కమిషన్, న్యాయ సేవధికార సంస్థ మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలందరు చట్టాలపై అవగాహన కలిగివుండాలని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను అమలు చేస్తున్నాయన్నారు.ఎవ్వరితోనైనా బాదింపబడుతున్న మహిళలు తమను సంప్రదిస్తే జాతీయ ఉచిత న్యాయ సేవ సంస్థ ద్వార న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. నేరం అనేది తెలిసిచేసిన, తెలియక చేసిన చట్టం నుండి
తప్పించుకొనేందుకు వీల్లేదన్నారు. అనంతరం న్యాయవాదులు/రిసోర్స్ పర్సన్లు మనోహర్, హేమలత మహిళలకు వివిధ చట్టలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ మహిళా కమిషన్ మెంబర్ Dr. షేక్ రోఖయ బేగం, స్థానిక ఎం.పి.డి.ఓ. శ్రీనివాసులు, ఓర్వకల్ మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారులు విజయ భారతి , ఓర్వకల్ సి. డి. పి. ఓ. అనురాధ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట రామి రెడ్డి, ఓర్వకల్ సి. ఐ. చంద్రబాబు నాయుడు, ఎస్.ఐ. సునీల్ కుమార్ తదితరులు పాల్గొనారు.