రబిలో సాగు చేసిన పంటలకు ప్రతి రైతు పంటల బీమా చేసుకోవాలి
పంటలకు బీమా రైతుకు ధీమా అని తెలిపిన మండల వ్యవసాయ అధికారి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం లోని 23 రెవెన్యూ గ్రామాల కు సంబంధించి రబీలో సాగు చేసిన పంటలకు బీమా సౌకర్యం ఉంది అని రైతు సోదరులకు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రభి లో సాగు చేసిన ఆయా పంటలకు ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన పథకం క్రింద పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతు వాటా చెల్లించాలని మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి కోరారు.రైతులు బ్యాంకు లో రభి లో పంట రుణాలు తీసుకున్న రైతులు నేరుగా బ్యాంకు లో ఫీల్డ్ ఆఫీసర్ ను సంప్రదించి సాగు చేసిన ఆయా పంటలకు,పంట ఇన్సూరెన్స్ చేసుకోనుటకు అనుమతి పొందిన పంటలకు ప్రీమీయం చెల్లించాలని కోరారు.మన వై.యస్.ఆర్ కడప జిల్లా కు ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీని ,దిగుబడి ఆధారిత పంటలకు ఎంపిక చేసారు. మరియు వాతావరణం ఆధారిత పంటలకు ఇఫ్కో కంపెనీ వారికి ప్రీమియం చెల్లించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని తెలిపారు.శనగ పంట గ్రామ యూనిట్ క్రింద పరిగణిస్తారు.అలాగే వేరుశనగ, జొన్న,ప్రొద్దుతిరుగుడు,నువ్వు,వరి, మినుము,మొక్క జొన్న పంటలకు మండల యూనిట్ క్రింద పరిగణిస్తారు.ఉల్లి, పెసర, పంటలను జిల్లా యూనిట్ క్రింద పరిగణిస్తారు. ప్రతి రైతు బ్యాంకులో రుణాలు పొందినప్పుడు తప్పనిసరిగా పంటలకు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.పంట రుణాలు తీసుకొని రైతులు అనగా నాన్ లోని రైతులు బయట కామన్ సర్వీస్ సెంటర్ లో గాని,సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లను సంప్రదించి పంట బీమా కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.మధ్య వర్తులను,దళారులను నమ్మవద్దని తెలిపారు.పంట బీమా రైతుకు ధీమా లాంటిది అన్నారు.రుణాలు తీసుకున్న వారు బ్యాంకు లో మాత్రమే చెల్లించాలని కోరారు.ఏదయినా ఒక చోట మాత్రమే ప్రీమియం చెల్లించాలని రైతులను కోరారు.ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు రైతులకు పంటల బీమా భరోసా ను కల్పిస్తుంది అని తెలిపారు.
ఆయా పంటలకు రైతులు ప్రీమియం చెల్లించాల్సిన వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.
పంట పేరు ఒక హెక్టారుకు
ప్రీమియం. రేటు శనగ 1200,వేరు శనగ 1200, నువ్వులు 450, జొన్న 787.50, పెసర. 675
ప్రొద్దుతిరుగుడు. 750, మినుము. 712.50, వరి. 1575 పై విధంగా కేటాయించిన కంపెనీలకు ప్రీమియం చెలించాలి అని తెలిపారు.రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం తో ప్రధాన మంత్రి పసల్ బీమా పథకం అమలు చేస్తున్నారు అని వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.మరిన్ని వివరాలకు ఆయా గ్రామాల ఆర్ యస్ కె సిబ్బందిని సంప్రదించాలి అని తెలిపారు.