దేశ గౌరవాన్ని మంట కలిపిన అదానిని అరెస్టు చేయాలి
జాయింట్ పార్లమెంట్ కమిటీతో విచారణ జరిపించాలి
ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులన్నిటిని రద్దు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్
న్యూస్ వెలుగు, కర్నూలు; కార్పొరేట్ కంపెనీ గా ఉన్న అధాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గౌతమ్ అధాని తాను చేసిన అవినీతి మరకలతో దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మంటగలిపారని, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ అన్నారు. శనివారం కర్నూల్ నగరం సుందరయ్య సర్కిల్లో ఆదాని అవినీతికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి న్యూ సిటీ కార్యదర్శి టి .రాముడు అధ్యక్షత వహించగా గౌస్ దేశాయి మాట్లాడుతూ..సెకి నుండి రాష్ట్ర డిస్కముల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు గాను ఆదాని గ్రూపులు భారీ ఎత్తున ముడుపులు చెల్లించిందన్నారు. అందుకుగాను అమెరికా కోర్టులో వ్యాజ్యం నమోదు అయిందన్నారు. సెఖి నుండి ఏపీ డిస్కములు సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేయడానికి 2019 – 24 మధ్య అధికారంలో ఉన్న వారికి రూ.1750 కోట్లు ముడుపులు చెల్లించినట్లు అమెరికాలో కేసు నమోదు అయిందన్నారు. ఈ ఒప్పందం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూర్చుతుందని సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో దేశంలో అదాని గ్రూప్ తో ప్రభుత్వం చేసుకున్న అన్ని ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెఖి ఒప్పందం మాత్రమే కాకుండా రాష్ట్రంలో పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటరు, గంగవరం పోర్టు వంటి వివిధ ప్రాజెక్ట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందం పేరుతో ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సంపదను వారికి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసిందన్నారు. ఆదాని గ్రూపు చేసిన అవినీతి రోతను హిడెన్బర్గ్ నివేదిక ద్వారా అప్పట్లోనే కుండలు బద్దలు కొట్టిందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అదానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, అందుకోసం పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. సాయి బాబా. కె. సుధాకర్ అప్ప. జి.ఎసు, బి. రామకృష్ణ. వి. శంకర్. జె. శ్రీనివాసులు. బీసన్న, నాగరాజు, మనోహర్, చిన్నబడేసా. పరశురాముడు, నారాయణమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు