పరిశుభ్ర గ్రామ పంచాయితీ నిర్మాణానికి కృషి చేయండి

పరిశుభ్ర గ్రామ పంచాయితీ నిర్మాణానికి కృషి చేయండి

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఆదివారం శ్రీ సిద్దేశ్వర స్వామి తేరు బజార్ నందు సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి ముమ్మరంగా పారిశుధ్య పనులు చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేరు బజార్ చెత్త చెద్దరంతో అపరిశుభ్రంగా మారడంతో ప్రజల అర్జీ మేరకు పారిశుధ్య కార్మికులతో పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు.మరియు ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కాలనీలకు వచ్చే గ్రామ పంచాయితీ ఆటో,ట్రాక్టర్ లో వేయాలని సూచించారు.చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల దోమలు,దుర్వాసన వెదజ్జెలి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని కావున ప్రజల తమ ఇంటి పరిసరాలలో పాటు పరిశుభ్ర గ్రామ పంచాయితీ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!