పట్టాలు తప్పిన హౌరా ముంబై మెయిల్‌

Jharkhand (జార్ఖండ్‌):  చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలో  హౌరా-ముంబై మెయిల్‌ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన  పోటోబెడా గ్రామ సమీపంలో  బడాబాంబో మరియు ఖర్సావా రైల్వే స్టేషన్ మధ్య ఈ ఉదయం హౌరా-ముంబై మెయిల్‌  18 బోగీలు పట్టాలు తప్పడంతో అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హౌరా నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు రైలు వెళ్తోండగా ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు. ప్రమాద ఘటనపై ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు . ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు  సహాయ రైలు చేరుకుంది. సహాయ, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సీనియర్ రైల్వే అధికారి పేర్కొన్నారు . టాటానగర్ (06572290324), చక్రధర్‌పూర్ (06587 238072), రూర్కెలా (06612501072, 06612500244), రాంచీ (0651278711) మరియు హౌరా (93203387320337320356) కోసం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసినట్లు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!