నిరుపేదలకు న్యాయం చేయండి
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం నిరుపేదలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామ పొలంలో 2013 వ సంవత్సరంలో 150 మంది నిర్వాసితులకు అసైన్మెంట్ కమిటీలో ప్రభుత్వము ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది. కానీ రెవెన్యూ అధికారులు ఆ పొలానికి సరిహద్దులు చూపకపోవడం కూడా జరిగిందని నిరుపేదలు సమావేశంలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ పార్టీకి చెందిన భూభకాసురులు రెవెన్యూ కార్యాలయాల్లో పెత్తనం చేస్తూ చలామణి అవుతున్నారన్నారు. ఒంటిమిట్ట మండలంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో కూడా కార్యాలయాల్లో పెత్తనాలు చేస్తూ ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ ఖద్దరు బట్టలు వేసుకొని దర్జాగా జీవిస్తున్నారని మండల టిడిపి నాయకులు అంటున్నారు. ప్రతిరోజు మండలంలో ఏదో ఒక గ్రామంలో భూ అక్రమాలు చేసే కతనాలు చూస్తున్నామని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారంటూ దుయ్యబట్టారు. భూ ఆక్రమణల పెత్తందారుల ఆగడాలు ప్రభుత్వ అధికారులు అరికట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. నిరుపేదలకు కేటాయించిన సర్వే నెంబర్లలో భూభకాసురులు ఆక్రమించుకోవడంతో నిరుపేదలు విలలాడుతున్నారని ఈ విషయంపై తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను మొరపెట్టుకున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కావున త్వరితగతిన రెవెన్యూ అధికారులు స్పందించి భూ అక్రమార్కులు స్వాధీనం చేసుకున్న నిరుపేద ఇళ్ల స్థలాలను ,పొలాలను స్వాధీనం చేసుకొని నిర్వాసితులకు అండగా ఉండి యోగక్షేమాలు చూడాలని ఈ సందర్భంగా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది. అనంతరం నిరుపేదలు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అంజన గౌరి, తదితర రెవెన్యూ ఉన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.