కార్తీక కడ సోమవారం… ఓంకార క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
భక్తిశ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకున్న భక్తులు.
కొండపై వెలసిన అమ్మవారిని కాలినడకన పెద్ద ఎత్తున వెళ్లి దర్శించుకున్న భక్తులు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు : కడ కార్తీక సోమవారం సందర్భంగా నల్లమల్ల అభయారణ్యంలో వెలిసిన శ్రీ గంగా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.సోమవారం ఉదయం నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చి ఓంకారేశ్వరుడు తో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఓంకార క్షేత్ర ఆవరణలో మహిళలు,చిన్న పిల్లలు పెద్ద ఎత్తున కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక చివరి సోమవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి , అమ్మవారీ ప్రత్యేక పూజలతో పాటు పాల అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండే ఓంకార క్షేత్రానికి చేరుకొని పంచభూగ్గల కోనేటిలో పుణ్యస్నానుల ఆచరించి అభయాంజనేయుడు చుట్టూ ప్రదర్శనలు చేశారు. కొండపై వెలసిన పద్మవతి సహిత శ్రీనివాస కామాక్షి అమ్మవార్ల ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన వెళ్లి దర్శించుకోవడం విశేషం.చివరి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని వారికి ఎలాంటి సౌకర్యాలు తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో నాగప్రసాద్ తెలిపారు. అనంతరం భక్తులు కాశిరెడ్డి నాయన సత్రంలో నిర్వాహకులు ఏర్పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అక్కడే వన భోజనాలు చేయడం విశేషం. పలు సత్రాలు ఆధర్వంలో ఓంకారేశ్వర భక్తులకు ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు.అనంతరం భక్తులు మండలంలో వెలిసిన శివనంది కృష్ణానది క్షేత్రాలలో పరమేశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.ఆలయాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బండి ఆత్మకూరు ఎస్సై జగన్మోహన్ ఆధర్వంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.