
ఎల్ఐసి ఆఫీస్ లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఎన్ వి కృష్ణారెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవవలసిన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి సిబ్బంది నిర్మల, నరసింహులు, బాలరాజు, హరినాయక్ ,సతీష్ ,నాగరాజు, నరసింహ ,బిర్రు మోహన్, దావూద్ భాష ,సుబ్బరాయుడు,ప్రభావతి,మహబూబ్ బాషా, రాదయ్య, పురుషోత్తం, రత్నాకర్, గుర్రప్ప, రాము, ఓబులేసు, బ్రహ్మయ్య, మునయ్య ,జనార్ధనయ తదితరులు పాల్గొని జయప్రదం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra