
బుధవార పేటలోఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూస్ వెలుగు, కర్నూలు; భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కర్నూలు లోని బుధవార పేటలో ఘనంగా నిర్వహించారు. బుధవార పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జైభీం దళిత వికాస సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా వచ్చి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా హాక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలను సభలో ముఖ్య అతిథితులు విద్యార్థులకు వివరించారు. ఈసందర్భంగా జైభీం దళిత వికాస సంఘం అధ్యక్షుడు జే. శ్రీనివాసులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా బుధవార పేటలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టి వారిని చిన్నతనం నుంచే రెసిడెన్షియల్ స్కూళ్లల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పిస్తున్నామని తెలిపారు. బుధవార పేట స్లంమ్ ఏరియా లో ఉన్నందున విద్యార్థులు చెడు అలవాట్లకు గురికాకుండా వారిని చదువులు చెప్పిస్తున్నామని శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటి వరకు 90 మంది విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించామన్నారు. ఈకార్యక్రమంలో సురేంద్ర నాథ్, న్యాయవాదులు రవి,సుబ్బయ్య, చంద్రుడు,రాజేష్,చిన్న నారాయణ, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.