ఐ ఏ బి సమావేశాలకు ప్రజాప్రతినిధులు ఎందుకు హాజరు కాలేదు
న్యూస్ వెలుగు, కర్నూల్; రబీ పంటలకు నీటి విడుదల సంబంధించిన సమావేశానికి కొంతమంది శాసనసభ్యులు హాజరు కాకపో వడం ఏంటని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రబీ పంటలకు నీటి విడుదల సంబంధించిన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి పలువురు శాసనసభ్యులు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందని, బాధాకరంగా కూడా ఉందన్నారు. ఈ సమావేశంలో పాలకులు మాట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. వర్షాలు బాగా పడ్డాయి నీటి ఎద్దడి సమస్యలు ఉండవని చెప్పడం మరింత కృంగదీసేలా ఉందన్నారు. వర్షాలు పడ్డ నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టులు ఉన్నాయా.. చెరువులు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఆలోచన చేయకుండా ప్రజల మభ్య పెట్టేలా రైతాంగానే అక్షరాన్ని కలిగించేలా ఉంది అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం కు సంబంధించిన సుమారు రెండు కోట్లకు పైగా సామాగ్రి చోటు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి ఇంటికి నీరు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులకు ఉందని అధికారులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. కర్నూల్ నగరంలో పలు ప్రాంతాల్లో ఏ సమయంలో నీళ్లు వదులుతారో ముందు చెప్పాలని పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుందని, దీనివల్ల మోటర్లు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు ప్రస్తావన రాకపోవడం దీనిపై మాట్లాడే పాలకులు లేకపోవడం శోచనీయమన్నారు. పలు ప్రాంతాల్లో చెరువుల మరమ్మతులు కూడా లేవని పాలకులు ప్రభుత్వాలు మారుతున్న రైతుల కష్టాలు తీరడం లేదు అన్నారు . ఈ సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సాధారణంగా సమావేశాలకు ఉద్యోగులు సంబంధిత శాఖ అధికారులు హాజరు కాకపోతే జిల్లా ఉన్నతాధికారి నోటీసులు జారీ చేస్తారు. అదే విధంగా ముఖ్యమైన సమావేశాలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు జారీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయనే సందర్భంగా డిమాండ్ చేశారు. అధికారులు ఉద్యోగులు కనీసం 30 సంవత్సరాలు పైగా ఉద్యోగం చేస్తే పెన్షన్ వస్తుంది ప్రస్తుతం అది కూడా లేదు కానీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన శాసనసభ్యుడికి పెన్షన్ వస్తోంది ప్రజా ప్రతినిధులు కూడా జీతం పొందుతున్నారు. మరెందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.