
హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎంపిడిఓ విశ్వ మోహన్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని ఆర్.ఎస్ పెండేకల్ నందు గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మండల ఎంపిడిఓ అధికారి విశ్వ మోహన్ బుధవారం రోజున తనిఖీ చేశారు.అనంతరం వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతూ విద్యార్థులకు స్టడి అవర్స్ చేయిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని వార్డెన్ కు తెలియజేశారు.వసతి గృహంలో ఉన్న విద్యార్థుల హాజరు పట్టికను మొదలైన రికార్డులను పరిశీలించారు.అనంతరం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. సుంకన్న ఆద్వర్యంలో వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు ఎంపీడీవో విశ్వమోహన్ దుప్పట్లను పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది మనోహర్,బాలస్వామి, ఆనంద్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు