
యువతలోని సృజనను ప్రోత్సహించెందుకు ఐఐసిటి ఏర్పాటుకి కేంద్రం ఆమోదం
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు కేంద్రం బదులు
పల్నాడు, న్యూస్ వెలుగు; యువ డిజిటల్ సృష్టికర్తలలోని కళని, సృజనని, సామర్థ్యాలను పెంపొందించి, ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసిటి) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. హబ్, స్పోక్ మోడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ ద్వారా రాష్ట్రాల సహకారంతో కనీసం ఐదు ప్రాంతీయ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆమోదం చేసినట్లు తెలిపారు.