ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం గీతా ముఖర్జీ నగర్ ఏరియా లోని 38, 40 వార్డు సచివాలయాలలో పేదల కు
రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని 38,40 సచివాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధ్యక్షునిగా
పి రామకృష్ణారెడ్డి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలం ఏ మాత్రం ఇంటి నిర్మాణానికి సరిపోదని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి పేదలు ఎవరు ముందుకు రాలేదు అలాగే ప్రభుత్వం మంజూరు చేసిన 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి సరిపోవు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేయలేదు కావున ఎన్నికల కు ముందు గౌరవ చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని రెండు సెంట్లు స్థలం ఇస్తామని పేదలకు హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తవుతున్నది కావున రాష్ట్ర ప్రభుత్వం
ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు పెంచి ఇవ్వాలని ఇసుక సిమెంటు స్టీలు ప్రభుత్వం ఫ్రీగా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.