అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

   జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ

న్యూస్ వెలుగు, కర్నూలు; అణగారిన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ సేవలను కొనియాడారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే  134వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం పి మురళీకృష్ణ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా, మేధావిగా, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్తగా, రచయితగా, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచి వేతకుగురెైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మన జ్యోతిరావు పూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడని మహిళోద్ధరణకు కృషి చేసాడని 1873 సెప్టెంబరు 24న జ్యోతిరావుపూలే గారు తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడని సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతిరావుపూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించ బడ్డాడని ఆయన సేవలను కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు యన్ సి బజారన్న, ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుకన్న, బి సుబ్రహ్మణ్యం, డబ్ల్యూ సత్యరాజు, షేక్ నవీద్, షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రి పాషా, డివి సాంబశివుడు, షేక్ మాలిక్, పశుపల ప్రతాపరెడ్డి, జాన్ సదానందం ఎస్ ప్రమీల, లాజరస్, మొదలగువారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!