పదవి విరమణ పొందిన ఎస్సై, ఏఆర్ఎస్ఐ లకు ఘన సన్మానం

పదవి విరమణ పొందిన ఎస్సై, ఏఆర్ఎస్ఐ లకు ఘన సన్మానం

 కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్

న్యూస్ వెలుగు, కర్నూలు క్రైం : సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. ఈ సంధర్బంగా శనివారం పదవి వీరమణ పొందిన ఎస్సై,ఏఆర్ ఎస్ ఐలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి,జ్ఞాపికలను అందజేశారు.పోలీసుశాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు.
పదవీ విరమణ పొందినవారిలో…కర్నూలు హెడ్ క్వార్టర్ ఎస్సై – ఆర్.శ్రీనివాసు,ఆర్ముడు రిజర్వుడ్ ఆర్ ఎస్సై – ఎస్.సమీర్ భాషలు ఉన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ పొందిన సిబ్బందితో మాట్లాడుతూ కుటుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్,సిఐలు ప్రసాద్,శివశంకర్,ఆర్ ఐలు సోమశేఖర్ నాయక్,నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!