
పార్టీ సభ్యత్వం బడుగుబలహీన వర్గాలకు బాసటగా నిలిస్తుంది
హొళగుంద, న్యూస్ వెలుగు;  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి  శ్రీ వైకుంఠం శివప్రసాద్ ని రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు   వైకుంఠం జ్యోతి ను  మర్యాదపూర్వకంగా కలిసిన హొళగుంద మండల టిడిపి కన్వీనర్ శ్రీ తుంబలం డాక్టర్ తిప్పయ్య, టిడిపి సీనియర్ నాయకులు తోక వెంకటేష్, టిడిపి యువనాయకులు ఖాదర్ బాషా  రారావి అభిషేక్, రోడ్డే మల్లయ్య మరియు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించిన వైకుంఠం శివప్రసాద్ & జ్యోతి  తెలుగుదేశం పార్టీ సభ్యత్వం బడుగుబలహీన వర్గాలకు బాసటగా నిలిస్తుందని, ప్రజల సంక్షేమం జీవిత భధ్రతలకు సభ్యత్వం అత్యవసరమని, సభ్యత్వం యొక్క ఉపయోగం మరియు విలువలను క్షుణ్ణంగా వివరించి వాడవాడల బాధ్యతాయుతంగా సభ్యత్వ నమోదును నిర్వహించాలన్నారు.
 వారి ఆదేశానుసారం హొళగుంద మండల శనివారం వ్యాప్తంగా నూతన ఉత్తేజంతో సభ్యత్వ నమోదును నిర్వహిస్తామని ప్రజలకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా ప్రమాదవశాత్తు సంభవించే మరణాలకు 5 నుండి 15 లక్షల భారీ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి అవగాహన కలిగించడంతో పాటు ప్రజల సంక్షేమం  సాధికారతలకై సభ్యత్వం ఎంతో ఉపయోగకరమైనదని హొళగుంద మండల కన్వీనర్ తుంబళం తిప్పయ్య తెలిపారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda