ఉద్యానవన పంటలను పరిశీలించిన కలెక్టర్
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామంలో కడప జిల్లా కలెక్టర్ చెరువూరి. శ్రీధర్ సోమవారం ఉద్యానవన పంటలను పరిశీలించి పండిస్తున్న పంటలపై రైతులతో సంభాషించడం జరిగింది. ముందుగా ఆయన గ్రామంలోని రైతన్నలు సాగు చేస్తున్న పసుపు, సంపెంగ పంటలను పరిశీలించి పంటల యొక్క దిగుబడి పై ఆరా తీశారు. అలాగే తుఫానుల కారణంగా మండలంలో కురుస్తున్న వర్షాలు అధికం కావడంతో పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాల
 ని రైతులకు తెలియజేశారు. కురుస్తున్న వర్షాల ప్రభావం పంటలపై ఎలా ప్రభావితం ఉందనే విషయంపై చర్చించాడు. జిల్లాస్థాయి వ్యవసాయ ఉద్యానవన అధికారులతో ఆయన పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జిల్లా మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ మండల రైతన్నలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రైతన్నలకు తెలియజేయాలని రైతుల నుంచి ఏవైనా ఫిర్యాదులు అందినచో శాఖపరంగా తగు చర్యలు తప్పవన్నారు. అలాగే మండలంలో పాడి పరిశ్రమల గురించి

స్వయంగా ఆయన రైతులను అడిగి తెలుసుకొని పాడి పశుసంపదను అభివృద్ధి చేసుకోవాలని అందు నిమిత్తం ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పాడి పశుగణాభివృద్ధి చేసుకొని లబ్ధి పొందాలన్నాడు. ప్రధానంగా గ్రామంలో పండించే పంటల మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నాడు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.

 Journalist Balu Swamy
 Journalist Balu Swamy