మద్యం మత్తులో బ్రిడ్జిపై నుంచి వాగులోపడిన వ్యక్తి
బ్రిడ్జి కి ఇరువైపులా లేని రక్షణ కవచం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని బండి ఆత్మకూరులో సోమవారం సాయంత్రం అతీగా మద్యం సేవించిన వ్యక్తి స్థానిక బ్రిడ్జి పై నుండి అదుపుతప్పి కుందు నదిలో పడిపోయాడు. స్థానికులు చెప్పిన వివరాల మేరకు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన మద్దిలేటి సోమవారం సాయంత్రం అధికంగా మద్యం సేవించి, ఊగుతూ బ్రిడ్జి పై నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కుందూ నదిలో పడిపోయాడన్నారు. గమనించిన అక్కడ ఉన్న స్థానికులు,పోలీస్ సిబ్బంది మనోహర్,రఫీ వాగులో పడిన మద్దిలేటిని తాళ్ల సాయంతో బయటికి తీశారని అన్నారు. పలుమార్లు గ్రామసభలో స్థానికులు ఫిర్యాదులు చేసిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని, కనీసం రక్షణ కవచనం అయిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Was this helpful?
Thanks for your feedback!