వారసత్వ నడకలో పాల్గొన్న విద్యార్దులు
లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా): జూలై 30. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల ఎంపిక కమిటీ 406వ సమావేశం ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా నిలయం లేపాక్షిలో వారసత్వ నడకను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ భారత పురావస్తు శాఖ సహకారంతో వారసత్వ నడకను లేపాక్షి ఓరియంటల్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కేంద్ర పర్యాటక శాఖ సహాయ సంచాలకుడు కృపాకర్,పర్యాటక అధికారి ప్రవీణ్, చరిత్రకారుడు మైనా స్వామి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరి తదితరులు నడకను ప్రారంభించారు. ఓరియంటల్ పాఠశాల విద్యార్థులు మరియు హిందూపురం బాలాజీ కళాశాల విద్యార్థులు వారసత్వం నడకలో చురుగ్గా పాల్గొన్నట్లు తెలిపారు. ఓరియంటల్ పాఠశాల వద్ద ప్రారంభమైన వారసత్వ నడక ప్రధాన రహదారి గుండాసాగి, నంది విగ్రహం మీదుగా వెళ్లి వీరభద్ర స్వామి గుడిలో ముగిసిందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఇలా ఉండగా లేపాక్షి వీరభద్రాలయ చరిత్రను ప్రాకార గోడలపై గల శాసనాలను చరిత్రకారుడు మైనాస్వామి విద్యార్థులకు వివరించారు. శిల్పకళ మరియు తైల వర్ణ చిత్రాల గురించి మైనాస్వామి చెబుతున్నప్పుడు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారని ఉపాద్యాలు తెలిపారు. విద్యార్థులకు చరిత్ర సంస్కృతి శాసనాల పట్ల చరిత్రకారుడు మంచి అవగాహన కల్పించడం సంతోసించదగ్గ విశయమన్నారు. ఈ కార్యక్రమంలో భారత పురావస్తు శాఖ అధికారులు బాలకృష్ణ రెడ్డి, మహేష్, శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.