
ఇంటిపై సోలార్ ఎనర్జీ ఫ్యానల్ తో మిగులు విధ్యుత్ సాధిద్దాం
ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ఆదోని డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రతి ఇంటి పై సోలార్ ఎనర్జీ ప్యానెల్ ను బిగించి మిగులు విధ్యుత్ సాధిద్దామని ఆదోని డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి పిలుపునిచ్చారు.మండల కేంద్రమైన తుగ్గలి విధ్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన బుధవారం సందర్శించారు.ఈ సందర్బంగా పత్తికొండ డిప్యూటీ ఇంజనీరు ఖాజావలి,తుగ్గలి ఏఇ మహేశ్వర్ రెడ్డి సిబ్బంది ఆయన కు ఘన స్వాగతం పలికారు. ఆయనకు శాలువ,పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సోలార్ ఎనర్జీ ప్యానల్ ను ఇంటి పైకప్పుల మీద ఏర్పాటు చేసుకొని, ఇంటి అవసరాలకు మించి విధ్యుత్ ఉత్పత్తి అవుతుంటే అలా మిగులు విధ్యుత్ ను ప్రభుత్వానికి అమ్మవచ్చని ఆయన తెలిపారు.కావున సోలార్ ఎనర్జీ ప్యానల్ ఏర్పాటు కు కృషి చేయాలన్నారు.అగ్రికల్చర్ కలెక్షన్స్,బిల్ స్టాప్స్,లైన్లో మెయింటెనెన్స్ గురించి సిబ్బందికు వివరించారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి లైన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,జొన్నగిరి లైన్మెన్ రాందాసు, తుగ్గలి లైన్మెన్ వెంకటేష్ నాయక్, విధ్యుత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu