అనుమానాస్పద స్థితిలో తల్లి కూతురు మృతి
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
హోళగుంద, న్యూస్ వెలుగు: హొళగుంద మండలంలోని యబ్బటం గ్రామంలో అనుమానాస్పదంగా తల్లి కూతురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే హొలగుంద మండలం హెబ్బట్టం గ్రామంలో నివసిస్తున్న పింజరి సక్కరప్ప భార్య పింజరి సమీరా (21) సంవత్సరాలు కూతురు పింజరి సలీమా(4) ఇంట్లో ఎవరూ లేని సమయంలో విగత జీవులుగా చనిపోయి మంచం మీద పడుకోవడం జరిగిందని కానీ భర్త మాత్రం ఉరి వేసుకున్నారని చెప్పడం అందరిని ఆశ్చర్య చెకితులని చేస్తుంది. కానీ ఉరి వేసుకున్నట్ల ఎలాంటి ఆనవాలు లేవని,పింజరి సమీరాకు తలకు ఎడమవైపున రక్త గాయం ఉందని అన్నారు. వీరిద్దరిని భర్త పింజరి సక్కరప్ప చంపి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పింజరి సక్కరప్ప సొంత గ్రామం పెద్దకడబూరు మండలం కంపాడు గ్రామం. ఇతను బతుకు తెరువు కోసం 6 నెలల క్రితం హెబ్బటం గ్రామంలో నివసిస్తున్నాడనీ,హొలగుంధ పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకుని హత్య… లేక ఆత్మహత్య…అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు.