గొల్లపల్లిలో రెవెన్యూ సదస్సు
న్యూస్ వెలుగు,ఒంటిమిట్ట; గ్రామాల్లోని రెవెన్యూ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేందుకు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రోజు శుక్రవారం ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో మండల రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒంటిమిట్ట తాసిల్దార్ రమణమ్మ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ
 సదస్సు కార్యక్రమంలో గ్రామానికి చెందిన గ్రామస్తులు పాల్గొని రెవెన్యూ పరంగా తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో తాసిల్దార్ రమణమ్మ గ్రామస్తులతో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే సత్వరమే కేవలం 45 రోజుల్లోనే ఆ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట డిప్యూటీ తాసిల్దార్ అంజన గౌరీ, ఎంపీడీవో, మండల స్థాయి అధికారులు, మండల టిడిపి అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ఈశ్వరయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 Journalist Balu Swamy
 Journalist Balu Swamy