
46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
NTR (ఎన్టీఆర్ జిల్లా ) : ఆంధ్ర ప్రదేశ్ ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ రాజశేఖర బాబు తెలిపారు. 100 రోజుల ప్రణాళిక ను అమలు సందర్బంగా 17 మందిని అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు.
వారి నుంచి సుమారు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ పై ప్రత్యేక నిఘా వ్యవస్తాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM